మాక్లూర్: మండలానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 13న అదృశ్యమవగా, శుక్రవారం వాగులో శవమై తేలాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గుంజ్లి గ్రామానికి చెందిన గోపు పెద్ద భోజన్న (55) గురువారం ఉదయం పొలానికి వెళ్లగా, రాత్రయినా తిరిగి ఇంటికి రాలేడు. కుటుంబసభ్యులు ఎంతవెతికినా అతడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం స్థానిక వ్యవసాయ బోరుబావి వద్దగల వాగులో శవమై తేలాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడు చేపలు పట్టడానికి వాగులోకి దిగాడా? లేక వ్యవసాయ మోటార్‌కు రిపేర్ చేయడానికి వాగులో దిగి, ప్రమాదవశాత్తు మృతి చెందాడా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.