రుద్రూర్: మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శుక్రవారం షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించి రెండు నివాసపు గృహలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన లక్ష్మీ, సావిత్రిలు తమ ఇళ్లల్లో ఒంటరిగానే ఉంటున్నారు. హోలీ సందర్భంగా వారు బయటకు వెళ్లిన సమయంలో ఆయా ఇళ్లల్లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి బోధన్ ౖఫైర్ స్టేషన్ సిబ్బందికి స మాచారం అందించగా, వారు గ్రామానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు కాలిపోయాయని బాధితులు తెలిపారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భారతి, తహసీల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ భూషన్ ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఒక్కొక్కరి ఇంటిలో సుమారు రూ. లక్షా 50వేలు ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. బాధితులకు ప్రభుత్వం సహాయాన్ని అందించాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు.
షార్ట్‌సర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధం