నిజామాబాద్ సిటీ: బీఆర్‌ఎస్ నాయకులు హరీశ్ రావు, కవితలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మానాల మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌నుద్దేశించి మాట్లాడిన మాటలను వారు విమర్శిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 14నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. హరీశ్‌రావు వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరుకోసం చేసినవిధంగా ఉన్నాయన్నారు. హరీశ్‌రావు బీజేపీ కోవర్టులాగా మాట్లాడుతున్నారన్నారు. మార్కెట్‌కమిటీ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు భోజన్న, భాగారెడ్డి, లింగం, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.