నిజామాబాద్ రూరల్: నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరుకాపు సంఘంలో సోమవారం గంగారాం మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, ఎస్‌ఈ రవీందర్, నార్త్ తహసీల్దార్ నాగరాజు, సరళ, మహేందర్‌రెడ్డి ఉన్నారు.
బాధితుడికి పరామర్శ
నిజామాబాద్‌అర్బన్: బీఆర్‌ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు త్యాగస్వామి ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో సోమవారం అతడిని తెలంగాణ ఉద్యమకారులు కోనేరుసాయికుమార్, ఈర్లశేఖర్, ప్రవీణ్‌లు పరామర్శించారు.