
ప్రజావాణికి 95 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఏసీపీ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్‌లకు వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ
హనుమంతు ఆదేశాలు