నిజామాబాద్‌నాగారం: నగరంలో క్రికెట్ అభిమానుల సంబురాలు మిన్నంటాయి. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా– న్యూజిలాండ్ తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈమ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో నగరంలోని పలు కాలనీల్లో క్రికెట్ అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. జయహో.. భారత్.. అంటు నినాదాలు చేశారు. అలాగే పలువురు అభిమానులు సాక్షితో తమ అభిప్రాయాలను తెలిపారు.
టీంఇండియా చాంపియన్స్ ట్రోఫీ
గెలవడంతో టపాసులు కాల్చిన యువత
నగరంలో క్రికెట్ అభిమానుల సంబురాలు