శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Mar 10 2025 10:14 AM | Updated on Mar 10 2025 10:14 AM

శ్రీర

శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

నిజామాబాద్‌ రూరల్‌: వచ్చే నెల లో నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్‌ ఇందూరు జిల్లా కార్యదర్శి పరాయితం లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని విశ్వ హిందూ పరిషత్‌ కార్యాలయంలో ప్రఖండ స మావేశం నిర్వహించారు. ప్రాంత కార్యదర్శి పరాయితం లక్ష్మీనారాయణ మాట్లాడూతూ.. రాబోయే కార్యక్రమాలు, ఉత్సవాలు, పరిషత్‌ వర్గ, బజరంగ్‌ దళ్‌ శౌర్యా ప్రశిక్షణ వర్గ, దుర్గా వాహిని వర్గ, మాతృశక్తి వర్గాల గురించి చర్చించారు. అంతకు ముందు శ్రీరాముని, భారతమాత చిత్రపటాలకు విశ్వ హిందూ పరిషత్‌ నా యకులు పూలమాలలు వేశారు. పదాధికారులు, ప్రఖండ అధ్యక్షులు, బజరంగ్‌ దళ్‌ సంయోజక్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రంథాలయాల

అభివృద్ధికి కృషి

ధర్పల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని శాఖ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతరెడ్డి రాజారెడ్డి అన్నారు. ఆదివారం ధర్పల్లి మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రంథాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఇటీవల ధర్పల్లి గ్రంథాలయానికి మౌలిక సదుపాయాల కోసం రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో గ్రంథాలయంలో చేసిన పనులను పరిశీలించారు. గ్రంథాలయంలో వైఫై కనెక్షన్‌, నాలుగు కంప్యూటర్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రంథ పాలకుడు కిషన్‌ను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు గ్రంథాలయ చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు చెలిమెల నర్సయ్య, చిన్నారెడ్డి, గంగారెడ్డి, సుభాష్‌, సురేందర్‌ గౌడ్‌, రాకేశ్‌ తదితరులు ఉన్నారు.

ఎండిన పంటల పరిశీలన

ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో ఎండి న వరి పంటలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేశ్‌ ఆదివారం పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని అన్నారు. నియోజకవర్గంలో చెక్‌ డ్యాములు, కుంటలను పునర్‌ నిర్మించాలన్నారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, చిన్నూ, నాయుడు రాజన్న, సక్కీ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

మోపాల్‌లో వాహనాల తనిఖీ

మోపాల్‌: మండలకేంద్రంలో ఆదివారం ఎస్సై యాదగిరిగౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. అలాగే వాహనదారులకు డ్రంకన్‌డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. దీంతో 3 డ్రంకన్‌డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటించిన వాహనదారులకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి 1
1/1

శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement