సుభాష్‌నగర్: కుటుంబంలో తల్లి పాత్ర అనిర్వచనీయమని, గృహిణి శ్రేయస్సే గృహం శ్రేయస్సని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి అన్నారు. జిల్లాలోనే మొట్టమొదటి మహిళా మున్సిపల్ కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ్ స్మారకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరుకాపు సంఘంలో శనివారం నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణురాలు రమాదేవి మాట్లాడుతూ.. సీ్త్ర ఆధారంగానే సమాజం నిర్మాణమవుతుందని, కుటుంబం మంచిచెడులకు ఆధారం ఆ సీ్త్ర నడవడి మాత్రమేనని, అందుకే సీ్త్రలు తమ జీవితాన్ని ఉన్నతమైన మార్గం వైపు నడిపించాలని సూచించారు. తమ పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దిన బీడీ కార్మికులు బెల్లాల్ సావిత్రి, బొబ్బిలి ఒడ్డెమ్మ, మున్సిపల్ కార్మికురాలు లావణ్య, డ్వాక్రా పొదుపు సంఘాల సభ్యురాలు వేముల శోభ, మున్సిపల్ ఆర్పీలు మీన, నిర్మల, నీరజ, సుజాత, ధారాబాయిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవాహ వారే దస్తగిరి, కార్యక్రమ నిర్వాహకుడు మాదాసు స్వామియాదవ్, బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు యెండల సుధాకర్, బీడీ కార్మికులు, పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.