
వరద నీటికి దారేదీ!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సోమవారం ఆగస్టు 19, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు కురిసిన వర్షంతో నిజామాబాద్ నగరంలో జనజీవనం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులన్నీ భారీగా వరద నీటితో నిండిపోయాయి. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఐదడుగుల లోతులో నిళ్లు నిలిచాయి. ఇతర రహదారుల్లోనూ భారీ గా నీరు పారడంతో సుమా రు మూడుగంటల పాటు ట్రాఫిక్ సమస్య అవస్థలపాలు చేసింది. వందమీటర్ల దూరం వెళ్లేందుకు 30 నిముషాల సమయం తీసుకుంది. వరదనీటి సమస్యను ఎదుర్కొన్న అనుభవాలు గతంలోనూ అనేకసార్లు కలిగాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగం శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునే విషయంలో ఒక్క అడుగూ ముందుకు వేయని పరిస్థితి. పైగా కీలకమైన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నవాళ్లకు, అక్రమ కట్టడాలకు బాజాప్తా ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు నిదర్శనంగా వరద నీరు వచ్చినప్పుడు కళ్లకు కట్టినట్లు సమస్య కనిపిస్తోంది. వ్యవహారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నగరం ట్రాఫిక్‌లో త్రిశంకుస్వర్గం మాదిరిగా తయారవుతుందని ప్రజలు అంటున్నారు. మరోవైపు వెంచర్లు వేస్తే పాటించాల్సిన నిబంధనల గురించి అధికారులు కాగితాల్లో మాత్రమే చూపుతున్నారు. ఎవరైనా క్షేత్రస్థాయిలో పూర్తిగా ఉల్లంఘించినప్పటికీ తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
● నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు, సెట్‌బ్యాక్, ఫైర్ అనుమతులు లేకుండానే అత్యధిక భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టా రు. వీటి విషయంలో అధికార యంత్రాంగం తమ కేం సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తోంది. పార్కింగ్ విషయంలో పోలీసు శాఖ వాహనదారులకు జరి మానాలు వేస్తుండగా.. ఆయా భవనాల పార్కింగ్, ఫైర్, సెల్లార్, సెట్ బ్యాక్ విషయమై ఆయా శాఖ ల మధ్య ఏనాడూ సమన్వ య సమావేశం జరిగిన దా ఖలాలు లేకపోవడం గమనార్హం.
నిజాంసాగర్ కాలువ సైతం..
మాలపల్లి, అహ్మద్‌పురా కాలనీ, నటరాజ్ థియేటర్ వెనుక నుంచి మిర్చి కాంపౌండ్ వైపు డి–54 కాలువను పూర్తిగా ఆక్రమించి ఇళ్లు, భవనాలు కట్టుకున్నారు. కాలువ ఆనవాళ్లనేవే లేకుండా పోయాయి. ఇతర ప్రాంతాల్లో కాలువలో పూడిక తీయలేని దుస్థితి నెలకొంది. మరోవైపు నగరంలోని కీలకమైన బొడ్డెమ్మ చెరువు వద్ద 28 ఎకరాల శిఖం భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేశారు.
● చెరువులు, అటవీ భూములు ఆక్రమించి వేసిన వెంచర్లు నగరంలో అన్నివైపులా కనిపిస్తాయి. ప్రభు త్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు విచ్చలవిడిగా ఆక్రమించి ఇప్పటికే స్వాహా చేసిన ప్రబుద్ధులు బోధన్ రోడ్డులోని 11వ వార్డు పరిధిలోని నుజహత్ కాలనీ వద్ద నిజాంసాగర్ కెనాల్‌ను, 11, 12 వార్డుల పరిధిలోని స్లాటర్ హౌస్ వెనుక ప్రాంతంలో చెరువులోనే చదును చేసి వెంచర్లు వేశారు. ఇప్పుడు ఇందులో నీరు చేరింది. ఇక్కడ భూములను కొనుగోలు చేసిన పేదలు భవిష్యత్తులో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది.
● స్లాటర్ హౌస్ వెనుక ఉన్న చెరువును సైతం మింగేస్తున్నారు. ఈ చెరువు చుట్టూ గుట్టలు ఉన్నాయి. గుట్టలపై రక్షిత అటవీ భూమి ఉంది. కొందరు ఏకంగా చెరువులో 12 ఎకరాలు మింగేశారు. ఇలాంటి దీన్ని పూర్తిగా చదును చేసి ప్లాట్లు చేశారు.
అర్సపల్లిలోని రామర్తి చెరువును ఆక్రమించి నిర్మాణాలు
పులాంగ్ వాగు, నిజాంసాగర్ కాలువ, డ్రెయిన్లు, చెరువుల కబ్జాలు
నిబంధనలు పాటించకుండా లేఅవుట్లు
గట్టిగా వానొస్తే ఇందూరు నగరం
అతలాకుతలం
మరోవైపు నాలాలు ఆక్రమించి భారీగా నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు
సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలను
ప్రోత్సహిస్తున్న మున్సిపల్ అధికారులు
బోధన్ రోడ్డులోని రామర్తి చెరువు విస్తీర్ణం 32 ఎకరాలు కాగా ప్రస్తుతం 6 ఎకరాల లోపు మా త్రమే మిగిలి ఉంది. ఈ విషయమై గత మార్చి నెలలో ‘సాక్షి’ కథనాలు రాయడంతో అధికారు లు మూడురోజుల పాటు కూల్చివేతల ప్రక్రియ నిర్వహించారు. తరువాత మళ్లీ ఆక్రమణదారు లు కట్టడాలు చేస్తుండడం గమనార్హం. నిజామాబాద్ నగరంలో వాగులు, కాలువలు, చెరువు లు, కుంటలు కబ్జాలు చేయడం ఒక ఎత్తైతే, నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాల కారణంగా అంతా జిగ్‌జాగ్‌గా మారింది. ఇప్పటికై నా బెంగళూరు, హైదరాబాద్, ముంబాయి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ అవసరాల మేరకు నగర పరిస్థితిని చక్కదిద్దే ప్రక్రియ చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. అవసరమైతే నిజామాబాద్ జిల్లాలోనూ ‘హైడ్రా’ మాదిరి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

వరద నీటికి దారేదీ!

వరద నీటికి దారేదీ!

వరద నీటికి దారేదీ!

వరద నీటికి దారేదీ!

వరద నీటికి దారేదీ!

వరద నీటికి దారేదీ!

వరద నీటికి దారేదీ!