సమాచారం.. | - | Sakshi
Sakshi News home page

సమాచారం..

Apr 17 2024 1:15 AM | Updated on Apr 17 2024 1:15 AM

సీఎంతోనే గల్ఫ్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఖలీల్‌వాడి: సీఎం రేవంత్‌ రెడ్డితోనే గల్ఫ్‌ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర మినరల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గల్ఫ్‌ బాధితుల స మావేశం నిర్వహించగా.. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఈరవత్రి అనిల్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈరవత్రి అ నిల్‌ మాట్లాడుతూ.. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన తాను నిత్యం గల్ఫ్‌ కార్మికుల వేదనలు, రోదనలు వింటూ పెరిగానన్నారు. తెలంగాణ వచ్చిన తర్వా తైనా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించానని అన్నారు. బొంబాయి, బొగ్గబాయి, దుబాయి అని ఉద్యమ సమయంలో మా ట్లాడిన కేసీఆర్‌ కూడా అధికారంలోకి వచ్చిన తర్వా త గల్ఫ్‌ బాధితుల గోడు వినలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి హయాంలో గల్ఫ్‌ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎంగా ఆయన చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

దరఖాస్తుల ఆహ్వానం

సిరికొండ: మండలంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారిణి షేక్‌ పర్వీన్‌ తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో 40 సీట్లకు, 7వ తరగతిలో ఖాళీగా ఉన్న 10 సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆధార్‌ కార్డు, టీసీ, బోనాఫైడ్‌, జనన ధ్రువపత్రం, కుల, ఆదాయ, ఆరోగ్య ధృవీకరణ పత్రాలతో పాటు నాలుగు పాస్‌ పోర్టు సైజ్‌ ఫోటోలతో పాఠశాలలో సంప్రదించాలని ఆమె తెలిపారు.

22 నుంచి వేసవి సంగీత తరగతులు

నిజామాబాద్‌ సిటీ: డీకే మ్యూజిక్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి మే 31 వరకు వేసవికాలం సంగీత తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ మాస్టార్‌ దినేష్‌కుమార్‌ మంగళవారం తెలిపారు.ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి ఏడు గంటల వరకు అన్ని వయస్సుల వారికి తరగతులు ఉంటాయని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు నగరంలోని గంగస్థాన్‌ ఫేజ్‌–2, రోడ్‌ నెంబర్‌–5 సుదర్శన్‌ రావు అపార్టుమెంట్‌లో జరుగుతాయని, వివరాలకు 84640 32683, 94400 23331.

నేటి నుంచి ఆలయంలో ఉత్సవాలు

సిరికొండ: మండల కేంద్రంలోని శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 61వ వార్షికోత్సవాలను బుధవారం(నేడు) నుంచి 20 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement