
ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్, సీపీ, అదనపుకలెక్టర్లు
సుభాష్‌నగర్ : శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి యాదిరెడ్డి రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్నిచోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పని చేసేలా నిర్ధారణ చేసుకోవాలని ట్రాన్స్‌కో ఏడీఈ రాజశేఖర్‌ను ఆదేశించారు. జెనరేటర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత చేపట్టే కౌంటింగ్ సాఫీగా జరిగే లా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు డీసీపీ జయరాం, ఏసీపీ కిరణ్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, అధికారులు ఉన్నారు.