న్యూస్‌రీల్
బక్రీద్‌కు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: బక్రీద్ పండుగను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మి శ్రా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈద్గాలు, మసీదుల వద్ద ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రార్థనా స్థలాల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పండుగ నేపథ్యంలో పురపాలక, గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. ఈద్గాల పరిసరాల్లో పరిశుభ్ర వాతావరణం కల్పించాలని, ప్రార్థనల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ, బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున తగిన బందోబస్తు చేపడుతున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అడిషనల్ ఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్, భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్లు అప్పాల గణేశ్‌చక్రవర్తి, బీబీ కుతిజ సిద్ధిఖి, వివిధ శాఖల అధికారులు, హిందు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.


