మైనారిటీల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

మైనారిటీల సంక్షేమానికి కృషి

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

● మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్‌చైన్‌గేట్‌: మైనారిటీల సంక్షేమం, వారి సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కష్ణారావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఫహేముద్దీన్‌ ఖురేషి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, నిర్మల్‌ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అర్జుమంద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరి ష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, అదన పు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్‌ సింగ్‌, డీఈవో భోజన్న పాల్గొన్నారు.

మైనారిటీల సమస్యలు పరిష్కరిస్తాం..

ఖానాపూర్‌: మైనారిటీల సమస్యలు పరిష్కరిస్తామ ని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఖానాపూర్‌ మండల మైనార్టీ నాయకులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లిని హైదరాబాద్‌లో కలిశారు. కాంగ్రెస్‌ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షబ్బీర్‌ పాషా మాట్లాడుతూ.. ఖానాపూర్‌ ప్రాంతంలో మైనారిటీ పాఠశాల, మసీదు, ఖబ్రస్థాన్‌, ఈద్గా, నిర్మించాలని కోరారు. ఉర్దూ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇమామ్‌లకు వేతనాలు ఇవ్వాలని విన్నవించారు. మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ.. మెనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్‌ జామా మసీదు అధ్యక్షుడు జహీర్‌ అహ్మద్‌, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ మజీద్‌, నియోజకవర్గ మైనార్టీ నాయకులు యూసుఫ్‌ఖాన్‌, ఏజీపీ ఆసిఫ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement