సీఎం చిత్రపటానికి పాలాభిషేకం | - | Sakshi
Sakshi News home page

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: ఉద్యమకారుల గుర్తింపునకు మాజీ ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ ముఖ్య మంత్రి చిత్ర పటానికి స్థానిక టీఎన్జీవో సంఘ భవనంలో సోమవారం పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా చైర్మన్‌ కొట్టె శేఖర్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమకారుల ఆకాంక్షలను తీర్చేలా కమిటీ పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు జగన్‌, నిర్మల్‌ గద్దర్‌ షరీఫ్‌, డాక్టర్‌ వినోద్‌, బొల్లోజీ నర్సయ్య, సామల వీరయ్య, దొంతుల చంద్రశేఖర్‌, కూన భూమేష్‌, అంగ జగదీశ్‌, ఎం.శంకర్‌, కటికే శివాజీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement