లారీలు ఎప్పుడొస్తయో..!? | - | Sakshi
Sakshi News home page

లారీలు ఎప్పుడొస్తయో..!?

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

లక్ష్మణచాంద: ఈ ఫొటోలో ధాన్యం కుప్పలపై కూర్చుని ఎదురుచూస్తున్నది రాచాపూర్‌ రైతులు. వీరంతా లారీలు ఎప్పుడొస్తాయా.. ధాన్యం సంచులు ఎప్పుడెత్తుతారా..!? అని ఎదురుచూస్తున్నారు. రాచాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఈనెల 1న కొనుగోలుకేంద్రం ప్రారంభమైంది. మే 3 నుంచి తేమశాతం వచ్చిన రైతులకు గన్నీ సంచులు ఇచ్చారు. ఈ కొనుగోలు కేంద్రంలో సుమారు 70 లారీల ధాన్యం ఉంది. ఇప్పటి వరకు కేవలం 9 లారీల ధాన్యం మాత్రమే మిల్లులకు పోయింది. మరో రెండు లారీలు వచ్చాయి. ఇంకా 59 లారీల ధాన్యం కేంద్రంలోనే ఉంది. అకాలవర్షం ముప్పు ఉండడంతో రైతులు లారీల కోసం స్వయంగా రైస్‌మిల్లులు, గోదాముల వద్దకు వెళ్లి గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఒక సంచికి రూ.10 అదనంగా ఇస్తామని లారీల యజమానులతో మాట్లాడుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement