నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. టాస్క్, కెరియర్ గైడెన్స్ సెల్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేళా ఏర్పాటు చేశారు. ఐటీఐ, డిప్లొ మా, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన దాదాపు 100 మంది హాజరయ్యారు. ప్రముఖ ప్రైవేట్ సంస్థలు, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో 11 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేయగా.. మరో 82 మందిని తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చదువుతోపాటు మంచి ఉపాధి అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఇందులో వైస్ ప్రిన్సిపల్ గంగాధర్, టాస్క్ కోఆర్డినేటర్ రజిత, రమేశ్‌రెడ్డి, బాలకృష్ణ, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


