నిర్మల్‌ఖిల్లా: ప్రపంచ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత్ గౌరవ్‌రత్నశ్రీ సమ్మాన్’ పురస్కారాల కార్యక్రమంలో నిర్మల్ డీఆర్డీవో కె.విజయలక్ష్మి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. న్యూఢిల్లీలోని చాణక్యపురిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. తొమ్మిది దేశాలకు చెందిన హైకమిషనర్లు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించగా, దేశవ్యాప్తంగా వందమందిని ఎంపికచేసి పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి విజయలక్ష్మికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఆమెను హ్యూమన్ రైట్స్ కమిషన్ శాశ్వత సభ్యురాలిగా కూడా నియమించారు. శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప మహిశిని, కాన్సులేట్ జనరల్ కేఎల్ గంజు తదితరులు పాల్గొని డాక్టరేట్‌తోపాటు, ఽశాశ్వతసభ్యురాలిగా ధ్రువీకరణ పత్రం అందజేశారు.


