అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

● జీసీసీ డీఎం సందీప్‌కుమార్‌

ఉట్నూర్‌రూరల్‌: ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో తేనె, మైనం, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, చిల్లగింజలు మొదలైన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ గుడిమళ్ల సందీప్‌కుమార్‌ పేర్కొన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్‌ డివిజన్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉట్నూర్‌ డివిజన్‌ కార్యాలయంలో మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బందితో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజనుల ఉపాధి అవకాశాలు ఈ చర్యలతో మెరుగుపడుతాయన్నారు. ప్రభుత్వ నిధులు వచ్చేవరకు ఎదురుచూడకుండా, వెంటనే సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిత్యం అటవీ ఉత్పత్తుల సేకరణకు కృషి చేయాలని కోరారు. నూతన డీఆర్‌ డిపోల్లో బియ్యంతోపాటు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో సీనియర్‌ మేనేజర్లు సంతోష్‌ కుమార్‌, తారాచంద్‌, రమేశ్‌, మనోహర్‌, ఇస్తారి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement