నర్సాపూర్(జి): మండలంలోని అంజనీ తాండ అటవీ ప్రాంతం కార్చిచ్చుతో దగ్ధమవుతోంది. పలుచోట్ల వృక్షాలు, కలప దుంగలు కాలి బూడిదవుతున్నాయి. వేసవిలో ఎండలు ముదురుతున్న దృష్ట్యా పలుచోట్ల మంటలు రాజేసుకున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మంటలకు విలువైన టేకు కలప వృక్షాలు దగ్ధం అవడంతో ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లుతోంది. జంతువుల మనుగడకు సైతం కార్చిచ్చుతో ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. రోడ్డు పక్కనే పరిస్థితి ఇలా ఉంటే లోపల ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అడవిలో రాలిన ఆకును శుభ్రపరిచే సిబ్బంది ఉన్నా నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


