యువకుడు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్యాయత్నం

Mar 30 2026 7:25 AM | Updated on Mar 30 2026 7:25 AM

వేమనపల్లి: రాజకీయ విభేదాలతో కొంత మంది తనను వేధిస్తున్నారని బుయ్యారం గ్రామానికి చెందిన ఓండ్ర రమేశ్‌ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముడిమడుగుల శంకర్‌, లావణ్య, కొరకొప్పుల పోచాగౌడ్‌, విజయ్‌కుమార్‌ గౌడ్‌, సత్యనారాయణ, దుర్గం జనార్ధన్‌లు సర్పంచ్‌ ఎన్నికల సమయంలో తమ అభ్యర్థి ఓటమికి కారకులయ్యానని, భూవివాదంలో తనపై కక్ష పెంచుకున్నారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. పలుమార్లు తనపై దాడికి యత్నించారని, నానా దుర్భాషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వీరి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసి గడ్డి మందు సేవించాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రైవేట్‌ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తండ్రి అంకయ్య నీల్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement