మామడ: ఉపాధిహామి పనులకు సంబందించిన రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక గురువారం నిర్వహించారు. ఉపాధిహామీ పనుల వివరాలను రిజిస్టర్‌లలో నమోదు చేయాలన్నారు. నర్సరీలలో మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. జూలైలో నిర్వహించే వనమహోత్సవానికి ఇప్పటి నుంచి నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం చేయాల్సిన పనులను ప్రారంభించాలన్నారు. మండలంలోని 27 గ్రామపంచాయతీల పరిధిలో గతేడాది రూ.7.43 కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు సమావేశంలో గుర్తించారు. మండలంలో 6,882 జాబ్ కార్డులుండగా 11,312 మంది కూలీలు ఉపాధిహామీ పనుల్లో పాల్గొన్నారు. 72 మంది వందరోజుల పనిదినాలు పూర్తి చేశారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీవీవో లక్ష్మ ణ్, హెచ్‌ఆర్ సురేందర్, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, ఎంపీవో హరికృష్ణ, ఏపీవో శివాజీ, ఎస్సార్పీ మహేశ్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.


