నర్సాపూర్(జి): మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మోహన్‌రావు(50) అప్పుల బాధతో ఖతార్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ గల్ఫ్ సమితి(టీజీఎస్) బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్‌రావు కుమార్తె పాలకుర్తి లహరిక పేరిట రూ.1.50 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఆ బాండ్‌ను గురువారం అందజేశారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సంఘ నాయకులు సుందరగిరి శంకర్ (ఇండియన్ ఎంబసీ ఖతార్ లో లేబర్ అండ్ ఫిషర్ మ్యాన్ విభాగం ఇండియన్ కమ్యూనిటీ బెనవాలెంట్ ఫోరం నాయకులు), ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు, ఎన్నారై రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, దొంతి అరవింద్, కుమార్ పాల్గొన్నారు.


