టైగర్‌జోన్‌పై గళమెత్తిన ఎమ్మెల్యే బొజ్జు | - | Sakshi
Sakshi News home page

టైగర్‌జోన్‌పై గళమెత్తిన ఎమ్మెల్యే బొజ్జు

Mar 27 2026 9:29 AM | Updated on Mar 27 2026 9:29 AM

ఖానాపూర్‌: నియోజకవర్గంలోని ఆదివాసీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తారు. కవ్వాల్‌ టైగర్‌జోన్‌ కారణంగా నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూవివాదాలను పరిష్కరించేందుకు జాయింట్‌ సర్వే నిర్వహించాలని కోరారు. మల్యాల, దొంగపల్లి, యాపల్‌గూడ, వంటి గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామాలపై డ్రోన్‌ సర్వే నిర్వహించడం వల్ల ఆదివాసీ మహిళల గోప్యతకు భంగం కలుగుతోందన్నారు. ఇసుక కొరత కూడా తీవ్ర సమస్యగా మారిందన్నారు. అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement