బీజేపీకి తగ్గిన ఓట్లు..
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు తగ్గడం గమనార్హం. నిర్మల్ మున్సిపాలిటీలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సమయంలో 95,696 మంది ఓటర్లు ఉండగా, అప్పుడు బీజేపీకి 29,773 ఓట్లు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణంలో మొత్తం 93,543 మంది ఓటర్లు కాగా, 27,694 మంది కమలంవైపు మొగ్గుచూపారు. ఇక ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 98,204 మంది నిర్మల్ ఓటర్లలో కేవలం 20,035 మంది మాత్రమే బీజేపీ అభ్యర్థులకు ఓటేశారు. అదే కాంగ్రెస్‌కు అప్పటికి ఇప్పటికి ఓట్ల శాతం పెరుగుతూ వచ్చింది.


