ఎస్‌సీఈఆర్టీ సెమినార్‌కు మునీందర్‌రాజు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌సీఈఆర్టీ సెమినార్‌కు మునీందర్‌రాజు

Feb 17 2026 7:23 AM | Updated on Feb 17 2026 7:23 AM

ఎస్‌సీఈఆర్టీ సెమినార్‌కు మునీందర్‌రాజు

ఎస్‌సీఈఆర్టీ సెమినార్‌కు మునీందర్‌రాజు

సారంగపూర్‌: మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాడు మునీందర్‌రాజు ఎస్‌సీఈఆర్టీ సెమినార్‌కు ఎంపికై నట్లు ఎంఈవో మహేందర్‌ తెలిపారు. జనరేటివ్‌ ఏఐ ద్వారా అభ్యానావేదిక అనే వెబ్‌సైట్‌ రూపొందించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మ్యాథ్స్‌ ఏఐ మోడల్స్‌తోపాటు, విద్యార్థులకు అవసరమయ్యే విధంగా అభ్యాస దీపికలు రూపొందించడంతో ఆయనకు అవకాశం వచ్చినట్లు వివరించారు. కరోనా సమయంలోనూ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలను బోధించేందుకు గతంలో యూట్యూబ్‌ ద్వారా ఒక ఛానల్‌ను రూపొందించి ఆన్‌లైన్‌ పాఠాలు అందులో పొందుపర్చారని తెలిపారు. జూమ్‌ మీటింగ్‌ల ద్వారా పాఠాలను బోధించడంతోపాటు అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలను బోధించడం మునీందర్‌రాజు ప్రత్యేకత అని పేర్కొన్నారు. మునీందర్‌రాజును డీఈవో భోజన్న, మండల ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement