దంపతుల విజయం
నిర్మల్‌టౌన్: నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో పలువురు దంపతులు బరిలోకి దిగారు. ఒకే కుటుంబం నుంచి భార్య ,భర్త పోటీ చేసి గెలుపొందారు. భార్య, భర్తలు ఇద్దరూ పనిచేస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్న నమ్మకంతో ఓటర్లు ఇద్దరికీ పట్టం కట్టారు.
36, 37 వార్డుల్లో..
నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అప్పాల క్యావ 36వ వార్డు నుంచి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిపై 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈమె భర్త, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి 37వ వార్డు నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సాయి ప్రసన్నపై 451 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
27, 39వ వార్డుల్లో..
కాంగ్రెస్ పార్టీకి చెందిన భార్యాభర్తలు అయేషా కౌసర్–తౌహీద్ ఉద్దీన్ రఫ్ఫు ఘనవిజయం సాధించారు. అయేషా కౌసర్ 27వ వార్డులో 335 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థిపై, తౌహీద్ ఉద్దీన్ 39 వ వార్డులో 143 ఓట్లతో బీఆర్‌ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఈ దంపతులు రెండోసారి విజయం సాధించడం విశేషం.
దంపతుల విజయం


