ఐదుగురు సిట్టింగులకు చుక్కెదురు | - | Sakshi
Sakshi News home page

ఐదుగురు సిట్టింగులకు చుక్కెదురు

Feb 14 2026 9:48 AM | Updated on Feb 14 2026 9:48 AM

ఐదుగురు సిట్టింగులకు చుక్కెదురు

ఐదుగురు సిట్టింగులకు చుక్కెదురు

ఖానాపూర్‌: ఖనాపూర్‌ మున్సిపాలిటీకి రెండోసారి ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో పోటీచేసిన ఆరుగురు.. మరోమారు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఈసారి కూడా బరిలో దిగారు. వివిధ పార్టీల నుంచి పోటీ చేశారు. కానీ ఐదుగురికి చుక్కెదురైంది. కేవలం ఒక్కరినే రెండోసారి విజయం వరించింది. 3వ వార్డులో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన జన్నారపు విజయలక్ష్మి ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగగా, ఓటమి ఎదురైంది. గతంలో 5వ వార్డులో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌గా గెలిచిన పరిమిలత సిట్టింగ్‌ స్థానంలో రిజర్వేషన్‌ అనుకూలించక 7వ వార్డు నుంచి బీఎస్పీ తరఫున బరిలో దిగారు. కానీ ఓటమే ఎదురైంది. ఇక 6వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి కౌన్సిలర్‌ అఫ్రినా అమానుల్లాఖాన్‌, రెండోసారి సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ నుంచే పోటీచేశారు. కానీ ఈసారి నిరాశే మిగిలింది. 8వ వార్డులో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన అబ్దుల్‌ ఖలీల్‌ వైస్‌చైర్మన్‌ అయ్యారు. ఈసారి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున తన భార్య షబానా ఫిర్దోస్‌ను నిలిపారు. కానీ విజయం వరించలేదు. ఇక 10వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తొంటి శ్రీనివాస్‌ కూడా రిజర్వేషన్‌ అనుకూలించకపోవడంతో తన భార్య తొంటి రాధను కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిపారు. కానీ, ఈసారి విజయం దక్కలేదు. గత ఎన్నికల్లో 11వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన చిన్నం సత్యం మరోసారి సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 178 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాడు.

అత్యధిక మెజారిటీ వీరిదే..

ఖానాపూర్‌: పట్టణంలోని 4వ వార్డు బీజేపీ అ భ్యర్థి గుమ్ముల అనంద్‌ పట్టణంలోని 12 వార్డుల్లో అందరికంటే ఎక్కువగా 251తో విజయం సాధించాడు. 4, 11 వార్డుల్లో ఉత్కంఠ పోరు సాగింది. 4వ వార్డులో ఏడుగురు అభ్యర్థులు ఉండగా, ఆరుగురి మధ్య తీవ్ర పోటీ సా గింది. 11వ వార్డులో ముగ్గురు పోటీలో ఉండగా, ఇద్ద రి మద్య పోటీ సాగింది. 10వ వార్డులో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన బండిపె ల్లి సిందూజ 207 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాల్లపల్లి రాజగంగన్న 205 మెజార్టీ, 11వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నం సత్యనారాయణ 178, 8వ వార్డు బీజేపీ అభ్యర్థి బొప్పారపు సత్యవతి 133, 12వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తోడసం ఇందిర 126 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement