పొదుపుతో భవిష్యత్తుకు భరోసా | - | Sakshi
Sakshi News home page

పొదుపుతో భవిష్యత్తుకు భరోసా

Feb 14 2026 9:48 AM | Updated on Feb 14 2026 9:48 AM

పొదుపుతో భవిష్యత్తుకు భరోసా

పొదుపుతో భవిష్యత్తుకు భరోసా

● టీజీబీ మేనేజర్‌ రాజేశ్వర్‌

సారంగపూర్‌: ప్రతీ వ్యక్తి తను సంపాదించిన దాంట్లో కొంతమొత్తాన్ని పొదుపు చేసుకుంటే అది భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జామ్‌ శాఖ మేనేజర్‌ రాజేశ్వర్‌ అన్నారు. మండలంలోని మహావీర్‌తండాలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు. ప్రజలు సంపాదిచిన మొత్తంలో నుంచి భవిష్యత్తు అవసరాల కోసం కొంత దాచుకోవాలని సూచించారు. అలాగే రికరింగ్‌ డిపాజిట్‌, బ్యాంకు డిపాజిట్‌, ఇతర బీమా పథకాలను గురించి వివరించారు. బ్యాంకుల ద్వారా అందిస్తున్న ముద్ర రుణాలు, ఇతర రుణాలను గురించి వాటికి బ్యాంకులు వేసే వడ్డీ వివరాలు తెలియజేశారు. మండలంలోని చించోలి(బి) గ్రామంలో నిర్మల్‌ శాఖ ఆధ్వర్యంలో మేనేజరు శశికాంత్‌ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. పొదుపుతోపాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం జేజేబీవై, ఎంపీఎస్‌బీవై బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌ సాయన్న, వీవో అధ్యక్షురాలు సుజాత, ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఎంసీ నాయుడు, మహిపాల్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement