● వెయ్యి మందితో బందోబస్తు ● ఎస్పీ జానకీ షర్మిల
భద్రత విషయంలో రాజీ వద్దు
భైంసాటౌన్/భైంసారూరల్: గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల భద్రత విషయంలో రాజీ వద్దని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ గార్డెన్‌లో ఎన్నికల విధుల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. బుధవారం జరుగనున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. వెయ్యిమంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించినట్లు చెప్పారు. ఓటింగ్ ప్రారంభమైంది మొదలు కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


