సమస్యలు పరిష్కరించాలి
● డీఎంహెచ్‌వోకు ఆశ వర్కర్ల వినతి
నిర్మల్‌చైన్‌గేట్: తమ సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించినా రెమ్యూనరేషన్ చెల్లించలేదని పేర్కొన్నారు. భైంసా పట్టణ ఆశ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న ఎల్సీడీసీ, పల్స్ పోలియో బకాయిలతోపాటు ఈనెల 18 నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఎల్సీడీసీ సర్వే రెమ్యునరైజేషన్ అందేలా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు సుజాత, ప్రధాన కార్యదర్శి గంగమణి, ఉపాధ్యక్షురాలు కమల, జిల్లా నాయకులు లావణ్య, సుజాత పాల్గొన్నారు.


