నేడే తుది సమరం
న్యూస్‌రీల్
జిల్లాలో మూడోవిడత పోలింగ్ 124 పంచాయతీల్లో ఎన్నికలు బరిలో 386 మంది సర్పంచ్ అభ్యర్థులు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్..
నిర్మల్
ప్రోత్సహిస్తే వీళ్లు ‘మెస్సీ’లే!
ఉమ్మడి జిల్లాలోని పలువురు విద్యార్థులు ఫుట్‌బాల్ ఆటలోనూ రాణిస్తున్నారు పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతున్నారు.
రాష్ట్రస్థాయి బాక్సింగ్‌కు నిర్మల్ క్రీడాకారులు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని సహస్ర బాక్సింగ్ అకాడమీలో మంగళవారం జిల్లాస్థాయి సీనియర్ బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వెంకటేశ్(50–55 కేజీల విభాగంలో) శ్రీకాంత్ (55–60 కేజీల విభాగంలో), ఎల్.శ్రీకాంత్(60–65 కేజీల విభాగంలో) ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 21న హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, సెక్రెటరీ చందుల స్వామి, జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ బాక్సర్లను అభినందించారు.
నిర్మల్/భైంసారూరల్: పంచాయతీ ఎన్నికల్లో చివరిదైన మూడో విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతోంది. జిల్లాలోని భైంసా, ముధోల్, తానూరు, కుభీర్, బాసర మండలాల్లోని 124 గ్రామ పంచాయతీలు, 791 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆయా మండలాల్లోని పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి తీసుకున్న సిబ్బంది మంగళవారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. పంపిణీ, పోలింగ్ కేంద్రాలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
‘ముధోల్’ ఓటెత్తాలె..
మొదటి విడతతో పోలిస్తే రెండోవిడతలో పోలింగ్‌శాతం పెరిగింది. అటవీ, సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న తొలివిడతలో 80.42 శాతం నమోదైంది. మైదాన ప్రాంతమైన నిర్మల్ నియోజకవర్గంలో రెండోవిడతలో 82.67 శాతం నమోదైంది. తొలివిడతతో పోలిస్తే మరింత ఎక్కువ పోలింగ్ నమోదు కావాల్సి ఉన్నా.. రెండోవిడతలో చాలామంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కానీ.. రాజకీయంగా చైతన్యంతోపాటు పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలుగా భావించే ముధోల్ ప్రాంతం ఓటుహక్కు వినియోగానికి పోటెత్తాల్సిన అవసరం ఉంది. ఈ విడతలో మొత్తం 1,50,593 ఓటర్లు ఉన్నారు.
బరిలో 386 మంది అభ్యర్థులు..
చివరి విడతలో మండలాలు తక్కువగా ఉన్నా జీపీలు 133, వార్డులు 1,126 ఉన్నాయి. ఇందులో తొమ్మిది పంచాయతీలు, 333 వార్డులు ఏకగ్రీవం కాగా, భైంసా, కుభీర్‌లో ఒక్కో వార్డుకు నామినేషన్‌లు రాలేదు. మిగిలిన 124 జీపీలు, 791 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ స్థానాలకు 386 మంది, వార్డు మెంబర్ కోసం 2,151మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పోటాపోటీగా..
మూడోవిడత పోలింగ్ మొత్తం ముధోల్ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీల్లోనే సాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఈ మండలాల్లో రాజకీయంగా పోటీ నెలకొంది. చాలా జీపీల్లో ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరిద్దరు బరిలో ఉ న్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లో వర్గాలు ఉండటమే ఇందుకు కారణం. బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గమైనా కాంగ్రెస్‌కు మాజీఎమ్మెల్యేలు నాయకులుగా ఉండటం ఇక్కడ పల్లెపోరు ప్రతిష్టాత్మకంగా మారింది.
ప్రత్యేక బలగాలు....
ఎస్పీ జానకీ షర్మిల నేతృత్వంలో మూడో విడత పల్లె సమరానికి ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు. ఏఎస్పీ రాజేశ్ మీనా ఐదు మండలాల్లోని పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించా రు. ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. సమస్యాత్మక పంచాయతీల్లో అదనపు బలగాలను మోహరించారు.
మాట్లాడుతున్న ఎస్పీ జానకీషర్మిల,
చిత్రంలో ఏఎస్పీ రాజేశ్ మీనా
కాంగ్రెస్‌కే స్పష్టమైన మెజారిటీ
పోలింగ్ అధికారుల వివరాలు..
ఇద్దరు సభ్యుల బృందాలు 980
ముగ్గురు సభ్యుల బృందాలు 110
నలుగురు సభ్యుల బృందాలు 36
మొత్తం అధికారుల బృందాలు 1,126
మొత్తం పీవోలు 1,464
మొత్తం ఓపీవోలు 1,700
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు
మూడోవిడత ఎన్నికల వివరాలు..
మండలం మొత్తం మొత్తం ఏకగ్రీవ ఏకగ్రీవ ఎన్నికలయ్యే ఎన్నికలయ్యే సర్పంచ్ వార్డు
జీపీలు వార్డులు జీపీలు వార్డులు జీపీలు వార్డులు అభ్యర్థులు అభ్యర్థులు
భైంసా 30 258 –– 55 30 202 94 516
ముధోల్ 19 166 02 53 17 113 55 325
కుభీర్ 42 344 03 112 39 231 118 645
తానూరు 32 268 03 82 29 186 82 492
బాసర 10 90 01 31 09 59 37 173
మొత్తం 133 1,126 09 333 124 791 386 2,151
నేడే తుది సమరం
నేడే తుది సమరం
నేడే తుది సమరం
నేడే తుది సమరం


