విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
● సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ నారాయణ
పెంబి: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారు ఫిర్యాదుల పరిష్కార ఫోరం చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. ఖానాపూర్ సబ్ డివిజన్ పరిధిలోని పెంబి, మామడ, ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను పెంబి సబ్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేశారు. ఆయా మండలాల వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఈ సావలియ నాయక్, డీఈ నాగరాజు, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.


