కుష్ఠుకు చెక్ పెట్టేలా..
రేపటి నుంచి గుర్తింపు సర్వే.. ఈ నెల 31 వరకు ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ సర్వేలో పాల్గొననున్న 559 మంది ఆశ కార్యకర్తలు వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా చికిత్స, మందులు
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుష్ఠు వ్యాధిని కట్టడి చేసేలా కొత్త చర్యలు చేపట్టింది. జాతీయ కుష్ఠు నివారణ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 18(గురువారం) నుంచి 31 వరకు ఎల్‌సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ కంపైన్) పేరిట ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. మొదటి విడతలో 1,82,343 ఇళ్లను కవర్ చేసి 8 మంది రోగులను గుర్తించారు. గత మార్చిలో జరిగిన సర్వేలో 559 మంది అనుమానితులను గుర్తించి, పరీక్షల ద్వారా 8 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. రెండో విడతకు 559 ఆశా కార్యకర్తలు, 115 మంది సూపర్‌వైజర్లు సర్వేలో పొల్గొంటారు. ప్రతీ 10 మంది ఆశ వర్కర్లకు ఒక పర్యవేక్షకుడిని కేటాయించారు. ఈమేరకు వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. 18 పీహెచ్‌సీల్లోని కార్యకర్తలు రోజుకు 20 ఇళ్లకు వెళ్లి అనుమానితుల వివరాలు సేకరిస్తారు. గుర్తించినవారికి 15 రోజుల్లో పరీక్షలు చేసి చికిత్స అందిస్తారు.
ప్రాథమిక లక్షణాలు
మైకోబాక్టీరియం లెప్రే బ్యాసిలస్ కారణంగా వ్యాపిస్తుంది. చర్మంపై గోధుమ రంగు మొద్దుమచ్చలు, స్పర్శ లేని ప్రదేశాలు, తిమ్మిరి లేదా పాలిపోయిన మచ్చలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. 1 నుంచి 5 లోపు మచ్చలు కనిపిస్తే వారికి ఆరు నెలలు, 5 కంటే ఎక్కువ మచ్చలు గుర్తిస్తే వారికి ఏడాది పాటు చికిత్స అందిస్తారు. అనుమాన లక్షణాలు దాచకుండా సర్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.
చికిత్స విధానం..
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత బహుళ ఔషధ చికిత్స(ఎండీటీ) అందిస్తారు. రోగులు రోజుకు రెండు టాబ్లెట్లు తీసుకోవాలి. అంగవైకల్యం ఉన్నవారికి మైక్రోసెల్యులర్ రబ్బర్ పాదరక్షలు, రూ.12 వేల సహాయం, పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఉచితం.
చికిత్స చేయించుకోవాలి
జిల్లాలో ఎంతమందికి లక్షణాలు ఉన్నాయనే సమాచా రాన్ని సేకరించి, వారికి చికిత్స అందించాలనే లక్ష్యంతో లెప్రసీ సర్వే చేపడుతున్నాం. ఈ నెల 18 నుంచి 31 వరకు ఇంటింటి సర్వే చేపడుతున్నాం. కుష్ఠు వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే సు లువుగా తగ్గించవచ్చు. అపోహలు వీడి చికిత్స చేయించుకోవాలి.
– డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్‌వో
కుష్ఠుకు చెక్ పెట్టేలా..


