నేనెవర్ని..?
నిర్మల్ మున్సిపల్ కార్యాలయం తనిఖీకి మంగళవారం వచ్చిన రీజినల్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారి షాహిద్ మసూద్ అన్ని విభాగాల్లో తిరుగుతూ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. అనంతరం ‘నేనెవర్ని.. నా హోదా ఏంటి’ అని అందరినీ ప్రశ్నించారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. చివరకు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్‌ను సైతం అడిగారు. తన పైస్థాయి అధికారి హోదాను కమిషనర్ కూడా చెప్పలేకపోయారు. ‘నా హోదా చెప్పినవారికి ప్రమోషన్ ఇప్పిస్తా’ అని మసూద్ పేర్కొన్నారు. చివరకు ఓ మహిళ ఉద్యోగి హోదా చెప్పడంతో ఆమెను అభినందించారు. మరోవైపు కార్యాలయ సిబ్బంది, కమిషనర్ పనితీరుపై ఆర్డీ అసహనం వ్యక్తం చేశాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్


