రాష్ట్రస్థాయి పోటీల్లో కేజీబీవీ విద్యార్థి ప్రతిభ
దిలావర్‌పూర్: మండల కేంద్రంలోని కేజీబీవి కళాశాల చెందిన ఎం.అక్షయ రాష్ట్ర స్థాయిలో జరిగిన ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. కళాశాలలో ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్న అక్షయ కిక్ బాక్సింగ్ జిల్లాస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. సంగారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. అక్షయను కేజీబీవీ ఎస్‌వో అపర్ణ, పీఈటీ జయశ్రీ మంగళవారం అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు.


