వణికిస్తున్న చలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. చాలా ఏరియాల్లో ఉష్ణోగ్రతలు మూడు రోజులుగా గణనీయంగా పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన శీతల గాలులు వీస్తాయని తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. చలి ప్రభావం రోజంతా ఉంటుందని తెలిపారు. ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మంగళవారం జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రత 11 డిగ్రీలుగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో చలిమంటలు వేసుకుంటున్నారు.
జంకుతున్న జనం..
రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచు అధికంగా కురుస్తుంది. దీంతో తెల్లవారుజామున జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పది రోజులుగా చలి తీవ్రత పెరగడంతో దీర్ఘకాలిక రోగులకు ఇబ్బందికరంగా మారింది. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ, జ్వరం, ఆయాసం కేసులు పెరుగుతున్నాయి. ఆస్తమా, సీవోపీడీ, అలర్జీ, నిమోనియా తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు మరింత ఇబ్బంది పడుతున్నారు.
వాతావరణ మార్పులతో సమస్యలు..
శీతల వాతావరణంతో అలర్జీ ఎక్కువగా ఉన్నవారు బ్రాంకై టిస్ బారినపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ శక్తివంతమవుతుందని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, ఆయాసం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఐదు నుంచి ఆరు రోజుల్లో తగ్గే జబ్బు, అలర్జీ ప్రస్తుతం రెండు వారాలు ఉంటుందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎన్‌హెచ్ – 44పై పొగ మంచు..
వణికిస్తున్న చలి
వణికిస్తున్న చలి


