నిర్మల్
న్యూస్‌రీల్
ధైర్యంగా ఓటు వేయాలి
కుంటాల: పంచాయతీ ఎన్నికల్లో ధైర్యంగా ఓటు వేయాలని భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా సూచించారు. మండలంలోని ఓలా గ్రామంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక బలగాలతో నిర్వహించిన కవాతులో పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట సీఐ నైలు, ఎస్సై అశోక్, సిబ్బంది ఉన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ముగిసింది. జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ నెల 11న దస్తురాబాద్, కడెం, పెంబి, లక్ష్మ ణచందా మామడ మండలాల్లోని 119 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలకు ఒక్క రోజే గడువు ఉండంతో గ్రామాల నుంచి వెళ్లి పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వలస ఓటర్లకు అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు. పోలింగ్ రోజు తప్పకుండా ఊరికి వచ్చి ఓటేయాలని కోరుతున్నారు. అందుకయ్యే ఖర్చులు భరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. గ్రామంలో దిగగానే ముట్టజెబుతామంటున్నారు. ఒక్క ఓటు కూడా గెలుపు ఓటమిని నిర్ణయిస్తుంది. దీంతో అంత వరకు రాకుండా ఉండేందుకు అభ్యర్థులు కష్టపడుతున్నారు. అయితే ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లోని 136 పంచాయతీలు ఉండగా, 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 119 గ్రామ పంచాయతీల్లో 454 మంది, 1,415 వార్డుల్లో 1,370 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సిబ్బందికి విధులు..
మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. ఉన్నతాధికారులు సిబ్బందికి విధులు కేటాయించారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3,368 పోలింగ్ కేంద్రాల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో వార్డుకు ఒక బూత్ చొప్పున ఉండగా.. 3,368 బ్యాలెట్ బ్యాకులను వినియోగించనున్నారు. ఇప్పటికే ఆయా మండలాలకు చేరుకున్నాయి. రెండు దఫాలుగా ఆర్వోలు, ఏఆర్వోలు, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, ఇతర టెక్నికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వీరితోపాటు జోనల్, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, నిఘా బృందాల సభ్యులు సేవలందించనున్నారు. ఉద్యోగి పనిచేసే చోట, సొంత నివాస, మండలాన్ని పరిగణలోకి తీసుకుని వేరే మండలంలో విధులు కేటాయించారు. కొందరికి ఒకే విడతలో, అవసరాన్ని బట్టిమరికొందరికి రెండు విడతల్లోనూ విధులు అప్పగించారు. జిల్లాలోని 400 పంచాయతీల పరిధిలో 3,368 వార్డు స్థానాలు ఉండగా, 2,259 మంది పీవోలు, ఏపీవోలు విధులు నిర్వహించనున్నారు. ఇందులో 20 శాతం అదనపు సిబ్బంది రిజర్వులో ఉంటారు. ఇక బందోబస్తు కోసం 2,144 మందిని వినియోగించనున్నారు.
200 మంది ఓటర్లకు..
పోలింగ్ కేంద్రం పరిధిలో 200 మంది ఓటర్లు ఉంటే ఇద్దరు (1+1) చొప్పున సిబ్బంది ఉంటారు. ఇందులో ఒకరు పీవో, మరొకరు ఏపీవో మాత్రమే విధులు నిర్వర్తిస్తారు. 201 నుంచి 400 మంది వరకు ఓటర్లు ఉంటే ముగ్గురు (1+2) పీవో, ఏపీఓతోపాటు అదనపు పోలింగ్ అధికారి అందుబాటులో ఉంటారు. 401 నుంచి 650 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో నలుగురు (1+3) సిబ్బందిని నియమిస్తారు. వీరితోపాటు ప్రతీ పోలింగ్ కేంద్రంలో అవసరాన్ని బట్టి ఇతర సపోర్టింగ్ స్టాప్‌ను కూడా నియమిస్తారు. పంచాయతీ ఎన్నికల కోసం మొదటి విడత 1,072 పోలింగ్ కేంద్రాల పరిధిలో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీవో) పోలింగ్‌లో కీలకంగా వ్యవహరించనున్నారు.
ఓటర్ల వివరాలు
మండలం పురుషులు మహిళలు మొత్తం
కడెం 14,048 15,111 29,159
లక్ష్మణచాంద 11,357 13,219 24,577
ఖానాపూర్ 11,423 12,234 23,657
మామడ 12,223 13,849 26,072
దస్తురాబాద్ 6,240 6,653 12,894
పెంబి 5,285 5,601 10,886
నేడు కేంద్రాలకు సిబ్బంది..
11న మొదటి విడత పోలింగ్ జరగనుంది. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. పోలింగ్ బాక్సులు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. దీంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
విద్యార్థులు దేశభక్తి
పెంచుకోవాలి
నిర్మల్‌టౌన్: విద్యార్థులు చిన్నతనంలోనే దేశభక్తి పెంచుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. జిల్లా కేంద్రంలోని వేదం గ్లోబల్ హైస్కూల్‌లో పౌర హక్కులు, బాధ్యతలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. విద్యార్థులు మన చుట్టూ.. ఉన్న ప్రజలను గౌరవిస్తూ.. ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా కుంగిపోకుండా, పరిష్కారం కోసం ప్రయత్నించే ధైర్యం ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మొత్తం వార్డు స్థానాలు 1,072
ఏకగ్రీవం అయిన వార్డు స్థానాలు 474
పోటీలో ఉన్న అభ్యర్థులు 1,370
మొత్తం సర్పంచ్ స్థానాలు 136
ఏకగ్రీవం అయిన స్థానాలు 16
ఎన్నికల బరిలో ఉన్నవారు 454
నిర్మల్
నిర్మల్
నిర్మల్


