నిర్మల్
న్యూస్‌రీల్
సేద తీరిన రైతన్న.. ఇంటికి చేర్చిన బసవన్న
ఆదివాసీల ఆత్మగౌరవం కోసం బిర్సాముండా పోరాటం
నిర్మల్‌చైన్‌గేట్: ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బిర్సా ముండా అని అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం బిర్సాముండా జయంతి ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బిర్సా ముండా ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. బిర్సా ముండా జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. వేడుకల్లో సీపీవో జీవరత్నం, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, మోహన్‌సింగ్, గిరిజన సంక్షేమ కార్యాలయ అధికారులు శివాజీ, పలువురు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పశువులకు, రైతులకు అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయంలో తోడుగా నిలిచే ఎద్దులతో రైతులకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అన్నదాత చెప్పినట్లుగా వింటాయి. కష్టాన్ని, బాధను కూడా అర్థం చేసుకుంటాయి. రైతులు కూడా తమకు చేదోడుగా ఉండే పశువులకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తారు. తాజాగా నిర్మల్ రూరల్ మండలం సిద్దాపురం సమీపంలో ఓ రైతు అలసిపోయి ఎడ్ల బండిలో ఇంటిక బయలుదేరాడు. మార్గమధ్యంలోనే కాసేపు కునుకు తీశాడు. అయినా బసవన్నలు మాత్రం క్షేమంగా ఇంటికి తీసుకెళ్లాయి. గ్రామీణ జీవనంలోని నిజమైన మమకారానికి ప్రతిరూపంగా నిలిచాయి. మాటలేకున్నా మనసున్న ఈ జంతువులు విశ్వాసం, కృతజ్ఞత, ప్రేమకు ప్రతీకలుగా నిలిచాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్


