విద్యార్థినుల భద్రతకు పోలీసు అక్క
నర్సాపూర్(జి): విద్యార్థినుల భద్రత, చట్టాలపై అవగాహన కోసం పోలీస్ అక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలోని కేజీబీవీని మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి శనివారం రాత్రి సందర్శించారు. చట్టాలపై అవగాహన కల్పించారు. పోలీస్ సేవల గురించి వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, డయల్ 100 ప్రాముఖ్యత, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినుల సమస్యలు విన్నారు. పరిష్కారం సూచించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు 100 ఆకారంలో ప్రదర్శన చేశారు.


