సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
నిర్మల్‌చైన్‌గేట్: పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అండర్–14, 17 బాల, బాలికల సాఫ్ట్‌బాల్, నెట్‌బాల్ ఎంపిక పోటీలు శనివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–17 బాలికల విభాగంలో 16, బాలుర విభాగంలో 19 మంది సాఫ్ట్ బాల్‌కు, అండర్–14 బాలుర విభాగంలో 14, బాలికల విభాగంలో 14 మంది సెలెక్ట్ అయ్యారు. ఎంపికై న జట్లు ఆదిలాబాద్ జిల్లా సోనాలలో ఈనెల 17న నెట్‌బాల్ 18న బజార్‌హత్నూర్‌లో సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్, కన్వీనర్ అన్నపూర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు రమణారావు, అనిత రాథోడ్, సంజు రాథోడ్, ఆర్గనైజర్ సంజీవ్, గస్కంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


