అటవీ సంపద భవిష్యత్ తరాలకు అందించాలి
మామడ: అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని, అడవుల సంరక్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి.రాధిక అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపూర్‌లో అటవీ వన్యప్రాణుల చట్టాలపై జిల్లా లీగల్ సెల్ అథారిటీ, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం నల్దుర్తి తుర్కం చెరువు, వెంగన్న చెరువు ఎకోటూరిజం సర్క్యూట్‌ను పరిశీలించి, సఫారీ నిర్వహించారు. చెరువు వద్ద ఉన్న బైనాక్యూలర్స్ ద్వారా పక్షులను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో నాగిని భాను, దిమ్మదుర్తి, నిర్మల్ ఎఫ్‌ఆర్‌వోలు శ్రీనివాస్‌రావు, రామకృష్ణారావు, డీఆర్‌వో నజీర్‌ఖాన్, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజలింగం, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ లింగాగౌడ్, న్యాయవాదులు రమణారావు, రంజిత్, టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు, అటవీశాఖ సిబ్బంది అన్నపూర్ణ, వెంకట్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


