ఆర్టీఏ అవినీతికి చెక్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ అవినీతికి చెక్‌ !

Oct 23 2025 6:37 AM | Updated on Oct 23 2025 6:37 AM

ఆర్టీ

ఆర్టీఏ అవినీతికి చెక్‌ !

● ఉమ్మడి జిల్లాలో చెక్‌పోస్టుల ఎత్తివేత ● కార్యాలయాల్లోనూ ఏజెంట్లను నిలువరిస్తే మేలు గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

8లోu

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తా

కుభీర్‌: ప్రజా సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రామారావ్‌ పటేల్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 101 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో నెలకొన్న రోడ్లు, తాగు, సాగునీరు, విద్య, వైద్యం, తదితర సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకోసం జీఎస్‌టీ 28 నుంచి 5శాతానికి తగ్గించి దీపావళి కానుక ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆనంద్‌రావు పటేల్‌, ఆత్మ చైర్మన్‌ వివేక్‌, మాజీ సర్పంచ్‌ రాథోడ్‌ శంకర్‌, నాయకులు రమేశ్‌, నాగేష్‌, దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖలో అక్రమాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. రాష్ట్రంలో రవాణా శాఖ చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న తనిఖీ కేంద్రాలను బుధవారం సాయంత్రం నుంచే అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుగా జాతీయ రహదారులు–44, 61, 363పై జైనథ్‌ మండలం భోరజ్‌, తానూర్‌ మండలం బెల్‌తరోడ, వాంకిడిలోని చెక్‌పోస్టులు పూర్తిగా తొలగించారు. మూడు నెలల క్రితమే రవాణా శాఖ లో తనిఖీ కేంద్రాలను ఎత్తి వేసి పూర్తిగా ఆన్‌లైన్‌ ఆ ధారిత వాహన పన్నుల వసూళ్లు, జరిమానాలు చె ల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా చెక్‌పోస్టులు అనధికారికంగానే కొనసాగుతూ వస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఏ సీబీ అధి కారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ తని ఖీల్లో లెక్కకు మించి ఉన్న రూ.1.26లక్షల నగదు భోరజ్‌ వద్ద, రూ.5,100 వాంకిడి చెక్‌పోస్టు వద్ద, బెల్‌తరోడ చెక్‌పోస్టు వద్ద రూ.3వేల నగదు స్వాధీ నం చేసుకున్నారు. అంతకుముందు ఇవే చెక్‌పోస్టుల్లో దాడులు జరుగగా.. అనధికారికంగా వసూలు చేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని కేసులు నమో దు చేశారు. తరచూ దాడులు, తనిఖీలు జరిగినా ఈ కేంద్రాల్లో సాగిన అవినీతిని నిలువరించలేకపోయారు. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల లక్ష్యాలు పూర్తి స్థాయిలో చేరడం లేదు. తాజాగా కేంద్రాలను ఎత్తివేయడంతో వాహన యజమానులు, డ్రైవర్ల నుంచి అనధికార వసూళ్లు పూర్తిగా తగ్గనుంది.

కార్యాలయాల్లో ఏజెంట్ల హవా

ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లోనూ ఏజెంట్లు, మధ్యవర్తల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఏజెంట్ల పేరుతో వాస్తవ చార్జీల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అంతా తెలిసి కూడా ఈ అనధికార వసూళ్లను ప్రోత్సహిస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, వినియోగదారులు లైసెన్స్‌, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు ఇవ్వడంలో ప్రభుత్వం విధించిన రుసుం, పన్నుల కంటే అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. చాలామందికి రవాణా శాఖ నిబంధనలపై అవగాహన లేమితో విద్యావంతులు సైతం మధ్యవర్తులతోనే కార్యాలయాలకు వెళ్తున్నారు. చాలా సేవలు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. సులువుగా పని పూర్తవుతుందనే కారణంతో ఏజెంట్లను ఆశ్రయిస్తున్న పౌరులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్లు షోరూంల్లోనే చేసుకునే వెలుసుబాటు ఇవ్వాలి. నిరక్షరాస్యులు సైతం కార్యాలయాల్లో సేవలు పొందేలా ఏర్పాట్లు, కార్యాలయాల్లో మధ్యవర్తులను కట్టడి చేస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత ఆధునిక సేవలను వినియోగించి దళారుల వ్యవస్థను తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా ఉమ్మడి జిల్లా కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేస్తే అక్రమ వసూళ్లు నిలిచే అవకాశం ఉంటుంది.

ఫైళ్లు తరలింపు..

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా అధికారులు ఆఘమేఘాలపై బోరజ్‌ చెక్‌పోస్టు వద్ద కార్యకలాపాలు నిలిపి వేశారు. బోర్డులు, బారికేడ్లు తొలగించారు. కంప్యూటర్లు, రశీదులు, ఆర్థిక పరిపరమైన రికార్డులను డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాని(డీటీసీ)కి తరలించారు. నలుగురు ఎంవీఐలు, ఆరుగురు ఏఎంవీఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు కార్యాలయ సిబ్బంది పని చేస్తున్నారు. వీరు మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే వారు. వీరిని డీటీసీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక నుంచి వీరికి ఇతర బాధ్యతలు అప్పగించనున్నారు.

సమస్యల పరిష్కారమెప్పుడో..!

క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు ఇప్పటికీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. వేతన పెంపు, క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో సేవలు..

వాంకిడి: చెక్‌పోస్టుల ద్వారా అందించిన సేవలను ఇకపై www. transport. telangana. gov. in వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ అనే ఆప్షన్‌ ద్వారా టెంపరరీ పర్మిట్‌, వాలంటరీ టాక్స్‌, స్పెషల్‌ పర్మిట్‌ వంటి సేవలు లభ్యమవుతాయి. సేవలపై చెక్‌పోస్ట్‌ సిబ్బంది కొన్ని నెలలుగా వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు చెక్‌పోస్టు వద్ద ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

బెల్‌తరోడాలో..

తానూరు: బెల్‌తరోడా చెక్‌పోస్టులోని ఫర్నిచర్‌ను నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అధికారులు, సిబ్బంది ఫర్నిచర్‌తోపాటు కంప్యూటర్లు, ఫైళ్లు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. చెక్‌పోస్ట్‌ను ఎత్తివేసినట్లు బ్యానర్‌ ఏర్పాటు చేశారు.

ఆర్టీఏ అవినీతికి చెక్‌ ! 1
1/2

ఆర్టీఏ అవినీతికి చెక్‌ !

ఆర్టీఏ అవినీతికి చెక్‌ ! 2
2/2

ఆర్టీఏ అవినీతికి చెక్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement