
భీం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి
నిర్మల్‌టౌన్: కుమురంభీం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య అన్నారు. బుధవారం భీం జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ పక్కన ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కుమురంభీం మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ఆదివాసీ హక్కులకోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మామడ మండలంలోని పోతారంలో భీమన్న ఆలయంపై పెత్తనం చెలాయిస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు షాకీ లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, రాజ్‌గోండు సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షుడు భీంరావు, జేఏసీ కన్వీనర్ మంద మల్లేశ్, వెంకురి శ్రీనివాస్, బోర్ర భీమేశ్, అత్రం రాజు, రామకృష్ణ, శ్రీనివాస్, ఉయిక భీంరావ్, పేనుక వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.