
పోలీస్‌స్టేషన్లో ఓపెన్ హౌస్
నిర్మల్‌రూరల్: పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల పనితీరు, సాంకేతిక పరికరాల వినియోగం గురించి ఏఎస్పీ రాజేశ్‌మీనా విద్యార్థులకు వివరించారు. సిబ్బంది విధులు, బాధితులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసే విధానం, విచారణ, సైబర్ వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలికల రక్షణకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సేవలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.