
‘ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి’
నిర్మల్‌టౌన్: ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి క్షేమంగా గమ్యం చేరాలని నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. బుధవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆదేశాల మేరకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ పరిచయం చేసుకున్నారు. బస్సులో కూర్చున్న తర్వాత ఇలా వివరించారు. ‘అందరికీ నమస్కారం.. నా పేరు తాళ్ల అశ్విని.. నేను ఈ బస్ కండక్టర్‌ను.. నా పేరు భూమన్న.. ఈ బస్సు డ్రైవర్‌ను అంటూ.. ఈ బస్సు నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్లేందుకు దాదాపు 4:30 నిమిషాలు పడుతుంది.. మిమ్మల్ని మీ గమ్య స్థానాలకు చేర్చాల్సిన బాధ్యత మాది’ అని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం.. శుభప్రదం అన్నారు. ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.