
ఈకేవైసీ అయితేనే ఉపాధి
లక్ష్మణచాంద: గ్రామీణ పేదలకు ఏడాదికి కనీసం వంద రోజుల పని కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఈ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి. దీంతో కేంద్రం ఎప్పటికప్పుడు సంస్కరణలు చేస్తోంది. తాజాగా హాజరులో పారదర్శకత కోసం కేంద్రం జాబ్‌కార్డు ఉన్న ప్రతీ కూలీ వివరాలను కేవైసీ విధానంలో నమోదు చేయాలని సూచించింది. గతంలో హాజరు సమస్యలు, పనులను బదులు ఇతరుల పేర్లతో హాజరు రాయడం వంటి అవకతవకలను నివారించేందుకు ఇది ముఖ్యమైంది. ఈ కేవైసీ ద్వారా ప్రతీ కూలీ పనికి నిజంగా హాజరు అయితేనే హాజరు నమోదు అవుతుంది. మరోవైపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలను నిర్దేశిస్తూ, రోజుకు కనీసం రూ. 307 వేతనం అందించబడుతుంది. రెండు పూటలుగా పని నిర్వహించడానికి మార్పులు జారీ అయ్యాయి.
ఫొటోలు ద్వారా హాజరు..
ప్రతీరోజు పనికి వెళ్లే కూలీల హాజరు రెండుసార్లు ఫొటోల ద్వారా నమోదు చేయబడుతుంది. మొదటి ఫొటోతో నాలుగు గంటల తర్వాత రెండో ఫొటో సరిపోతేనే హాజరు ధృవీకరించబడుతుంది. దీనివల్ల హాజరు సరిగా నమోదు అవడం, అవకతవకలు నివారణకు అవకాశముంటుంది.
ప్రస్తుత నమోదు ఇలా..
జిల్లాలో 41.41 శాతం కూలీల వివరాలు కేవైసీ ద్వారా నమోదు పూర్తి అయ్యాయి. మొత్తం 2,87,244 కూలీలలో 1,18,961 మంది కూలీలు ఈ ప్రక్రియ పూర్తి చేసినవారు, ఇంకా 1,68,283 మంది ఈ నమోదు పూర్తి చేయలేని వారు ఉన్నారు. కేంద్రం చేపడుతున్న ఈ చర్యలు గ్రామీణ ఉపాధి పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా, పేదలకు తప్పనిసరి ఉపాధి హామీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
జిల్లా సమాచారం....
మండలం టార్గెట్ ఈకేవైసీపూర్తి శాతం
సారంగాపూర్ 23,999 6,975 29.06
ముధోల్ 15,668 5,075 32.39
కుబీర్ 2,6401 9,047 34.27
లక్ష్మణచాంద 15,481 5,605 36.22
బాసర 7,835 2,729 35.70
తానూర్ 22,868 9553 41.77
మామడ 16,921 6858 40.53
నర్సాపూర్(జి) 12,288 4961 40.37
నిర్మల్ రూరల్ 13,676 5701 41.69
ఖానాపూర్ 16,465 6907 41.95
లోకేశ్వరం 20,009 8427 42.12
సోన్ 12348 5412 43.83
దిలావార్‌పూర్ 12,259 5610 45.76
పెంబి 8,101 3,963 48.92
భైంసా 22,235 10,708 48.16
కడెం 19,081 9395 49.24
దస్తురాబాద్ 7,529 3,876 51.48
కుంటాల 14,083 8,091 57.45