
క్రీడలతో మానసిక ప్రశాంతత
నిర్మల్‌టౌన్: క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని బాసర సర్కిల్ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమైన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. పోటీల్లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు 350 మంది పాల్గొన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, వాకింగ్, చెస్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్, క్యార మ్, జావెలిన్‌త్రో, తదితర క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం అడవుల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీఎఫ్‌వో వికాస్ మీనా, ఆదిలాబాద్ డీఎఫ్‌వో రేవంత్ చంద్ర, నిర్మల్ డీఎఫ్‌వో నాగినిభాను, అధికారులు కుమారి చిన్న, సుధాకర్, శివకుమార్, నాలుగు జిల్లాల అటవీ క్షేత్ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.