సోయా.. మద్దతు ఏదయా? | - | Sakshi
Sakshi News home page

సోయా.. మద్దతు ఏదయా?

Oct 13 2025 8:30 AM | Updated on Oct 13 2025 8:30 AM

సోయా.

సోయా.. మద్దతు ఏదయా?

9లోu సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

కోతలు మొదలై పక్షం దాటినా మొదలు కాని కొనుగోళ్లు ఇప్పటికే అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి... ఇప్పుడు కొనుగోళ్లు లేక మరింత నష్టం..

నిర్మల్‌
చదువులు చెప్పలేం..
ప్రైవేట్‌ పాఠశాలల్లోని పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో పాఠశాలలకు రావద్దని యాజమాన్యాలు చెబుతున్నాయి.

పునరావాసంలో ఇక్కట్లు

గడ్డెన్నవాగు ప్రాజెక్టు పునరావాస గ్రామాల్లో ప్రభుత్వం రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

గజ్జలమ్మ దేవికి పూజలు

కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రీకాంత్‌ రామానుజ దాస్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, తదిత ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గజ్జల మ్మ పల్లకిసేవలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.

భైంసా/భైంసారూరల్‌: జిల్లా వ్యాప్తంగా 15 రోజులుగా సోయా కోతలు జోరుగా సాగుతున్నాయి. అయితే అకాల వర్షాల ప్రభావంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న రైతులంతా ఎకరానికి కేవలం 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 72,300 మంది రైతులు 1.05 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేశారు. ప్రస్తుతం కోసిన పంట తడిసిపోతుందనే భయంతో వెంటనే విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5,328 ఉన్నా.. కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

కొనుగోళ్లు ప్రారంభించని మార్క్‌ఫెడ్‌..

జిల్లాలో నిర్మల్‌, సారంగాపూర్‌, ఖానాపూర్‌, భైంసా, కుభీర్‌లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వాటి పరిధిలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. మార్కెట్‌ అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్‌ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తేమ, నాణ్యత పేరిట రైతులను మోసం చేస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతీ సీజన్‌లో వ్యవసాయ మార్కెట్‌ల జాప్యం కారణంగా రైతులు మద్దతు ధర పొందలేకపోతున్నారు.

ప్రైవేటులో ధర లేదు

క్వింటాలు సోయాకు ప్రైవేటుగా రూ.4 వేలు చెల్లిస్తున్నారు. మద్దతు ధర రూ.5,328 ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులకే విక్రయించాల్సి వస్తుంది. పంట అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఏం లాభం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.

– సబ్బని మహేందర్‌, రైతు

ప్రభుత్వానికి నివేదించాం

జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లా వ్యాప్తంగా సాగైన పంట, వచ్చే దిగుబడి అన్ని వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రభుత్వం అనుమతులు ఇస్తే జిల్లా ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

– ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం, నిర్మల్‌

తాత్కాలిక ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం

కుభీర్‌: మండల కేంద్రమైన కుభీర్‌లోని కస్తూరి బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఆంగ్లం బోధించడానికి తాత్కాలిక పద్ధతిలో ఉపాధ్యాయురాలిని నియమించనున్నట్లు ప్రిన్సిపాల్‌ వాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, బీఎడ్‌ చదివిన మహిళలు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జిల్లా వివరాలు..

సోయా సాగు విస్తీర్ణం : 1.05 లక్షల ఎకరాలు

సాగుచేసిన రైతులు : 72,300

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర

: రూ.5,328

ప్రైవేటులో ప్రస్తుతం చెల్లిస్తున్న ధర : రూ.4 వేల నుంచి రూ.4,358

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు : ఖానాపూర్‌, నిర్మల్‌, సారంగపూర్‌, భైంసా, కుభీర్‌

సోయా పెట్టుబడి ఎకరాకు ఇలా..

విత్తనాలు : రూ.3,000

దున్నడం : రూ.2,000

విత్తనాలు వేసేందుకు : రూ.1,000

రసాయన మందులకు : రూ.1,000

కోత, నూర్పిడి ఖర్చు : రూ.6,000

14న జిల్లాస్థాయి

బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక

నిర్మల్‌రూరల్‌: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 14న అండర్‌–14, 17 బ్యాడ్మింటన్‌ బాలబాలికల జిల్లాస్థాయి జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో దర్శనం భోజన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్‌ బైపాస్‌ వద్ద గల ‘నిర్మల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ’లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట బోనాఫైడ్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, గత సంవత్సరం ప్రోగ్రెస్‌ కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లతో ఉదయం 8:30 లోపు రిపోర్టు చేయాలన్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు మాత్రమే పాల్గొనాలని, మిగతా వివరాలకు 9490002133 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ప్రైవేట్‌ వ్యాపారులే దిక్కు..

కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడంతో భైంసా, ఖానాపూర్‌ వంటి ప్రాంతాల్లో రైతులు పంటను ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గాంధీగంజ్‌ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.3,800 నుంచి రూ.4,350 వరకు మాత్రమే ధర లభిస్తోంది. నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. మద్దతు ధరతో పోలిస్తే రూ.వెయ్యి తక్కువ ఇస్తున్నారు. ఇప్పటికే వర్షాలతో నష్టపోయామని, వ్యాపారులు మరింత ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే పంట పాడైపోతుందనే భయంతో తక్కువ ధరకే అమ్ముకుంటున్నామని వాపోతున్నారు.

ఈ ఫొటోలోని రైతుపేరు మేక పండరి. భైంసా రూరల్‌ మండలానికి చెందిన ఇతను ఈ ఏడాది తనకున్న నాలుగెకరాల్లో సోయా సాగు చేశాడు. ఎకరాకు రూ.12 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. అధిక వర్షాల కారణంగా నాలుగు క్వింటాళ్లు మాత్రమే ది గుబడి వచ్చింది. పంట చేతికి వచ్చి 15 రోజులైంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో నిరీక్షిస్తున్నాడు. ప్రైవేటుగా క్వింటాల్‌కు కేవలం రూ.4 వేలు చెల్లిస్తున్నారని, ప్రభుత్వం కొనుగోలు చేస్తే మద్దతు ధర రూ.5,238 వస్తుందని చెప్తున్నాడు. జిల్లాలో సోయా పంట చేతికి వచ్చిన రైతులందరి పరిస్థితి ఇదే.

బాసర, భైంసా, ఖానాపూర్‌ మండలాల్లో రైతులు తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వినతిపత్రాలు ఇచ్చారు. భారత్‌ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో పలు మండలాల్లో నిరసనలు తెలిపారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు రైతు నాయకులు సమస్య వివరించి వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు.

సోయా.. మద్దతు ఏదయా?1
1/3

సోయా.. మద్దతు ఏదయా?

సోయా.. మద్దతు ఏదయా?2
2/3

సోయా.. మద్దతు ఏదయా?

సోయా.. మద్దతు ఏదయా?3
3/3

సోయా.. మద్దతు ఏదయా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement