
పాతాళగంగ ౖపైపెకి..
లక్ష్మణచాంద: ఈ ఏడాది జూలై చివరి నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వాగులు, చెరువులు, రిజర్వాయర్లు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 45,142 వ్యవసాయ బోరుబావులు వినియోగంలో ఉన్నాయి.
1.35 మీటర్లు పెరిగిన నీటిమట్టం..
జిల్లాలో గతేడాది సెప్టెంబర్‌లో సగటు నీటిమట్టం 3.80 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 2.45 మీటర్లుగా నమోదైంది. అంటే గత సంవత్సరం కంటే 1.35 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినట్లు డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌బాబు వెల్లడించారు. ప్రతీనెల భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో 42 ఎంపికై న బోరుబావుల్లో నీటి మట్టాలను కొలుస్తారు.
సెప్టెంబర్‌లో గణాంకాలు ఇలా..
సాధారణం కన్నా 27.11% అధికం
జిల్లాలో సాధారణ వర్షపాతం 910.1 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1,156.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. సాధారణం కంటే 27.11% అధికంగా వర్షపాతం వచ్చిందని అధికారులు తెలిపారు. తానూర్, ముధోల్, భైంసా, కుంటాల, నర్సాపూర్(జి), లోకేశ్వరం, దిలావర్‌పూర్, సారంగాపూర్, నిర్మల్ రూరల్, లక్ష్మణచాంద, పెంబి, మామడ, నిర్మల్ అర్బన్ మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది.
భూగర్భ జలాలు పెరిగాయి
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. గతేడాది సెప్టెంబర్ మాసంలో 3.80 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా ఈసారి 2.45 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అయినా నీటిని పొదుపుగానే వాడుకోవాలి. భావితరాలకు ఇబ్బంది కలుగకుండా చూడాలి.
– శ్రీనివాస్‌బాబు, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ జలాల శాఖ

పాతాళగంగ ౖపైపెకి..