
ఆత్మ రక్షణకు కరాటే
నిర్మల్‌ఖిల్లా: ఆత్మ రక్షణకు కరాటే అవసరమని జ పాన్ కరాటే అసోసియేషన్ ముఖ్య ప్రతినిధులు రా పోలు సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షుడు తేజేందర్‌సింగ్ భాటియా పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్ర త్యేక కార్యక్రమంలో షోటోకన్ స్టైల్ కరాటే జూని యర్ రెడ్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ అంశాల్లో గ్రేడింగ్ నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ముధోల్, ఖానాపూర్, ని ర్మల్ తదితర డివిజన్ల నుంచి దాదాపు 800మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆర్థోపెడిక్ సర్జన్ డా క్టర్ రఘునందన్‌రెడ్డి హాజరయ్యారు. కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్, కార్యదర్శి అమ్ముల భూషణ్, చందుల స్వామి, మహిళా శి క్షకురాలు మృణాళిని, భైంసా డివిజన్ మాస్టర్ సా యికృష్ణ, జ్ఞానతేజ, రాజశ్రీ, ఆరిఫ్‌ఖాన్, చిరంజీవి, శ్రీకాంత్, సాయికిరణ్ తదితరుల సమక్షంలో గ్రేడింగ్ నైపుణ్య పరీక్షల నిర్వహించారు. ప్రతిభ కనబరి చిన విద్యార్థులను అభినందించారు.